Share News

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - May 08 , 2026 | 09:34 AM

వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
AP Minister Satya Kumar

తిరుపతి, మే8 (ఆంధ్రజ్యోతి): వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ (AP Minister Satya Kumar) విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు. అవినీతి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతోనే డీఎంకే కొంపముంచాయని చెప్పుకొచ్చారు. ఈరోజు (శుక్రవారం) తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించారు.

SATYA-KUMAR-4.jpg


అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోందని తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి గంగమ్మకు‌ మొక్కులు తీర్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే వ్యతిరేకించడంతో ఓటమి పాలయిందని తెలిపారు. ఆయా పార్టీల మెజారిటీ ఆధారంగా తమిళనాడు గవర్నర్ నిర్ణయం తీసుంటారని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

SATYA-KUMAR-3.jpgSATYA-KUMAR-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 08 , 2026 | 10:41 AM