Home » AP BJP
తన తల్లి చింతకుంట రత్నమ్మ ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం జరుగుతోందని అనకాపల్లి ఎంపీ రమేష్ పేర్కొన్నారు. ఈ వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు.
గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మతి తప్పి మాట్లాడటం మానుకోవాలని యామిని శర్మ హితవు పలికారు.
ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని యామిని శర్మ మండిపడ్డారు.
ప్రధాని మోదీ స్వదేశీ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ నొక్కిచెప్పారు. ప్రజలు కూడా భారతదేశ ఉత్పత్తులనే కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.