Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదే: బీజేపీ చీఫ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 02:39 PM
హంద్రీనీవా ప్రాజెక్టు కెనాల్ పూర్తి చేసి.. కుప్పం వరకు నీళ్లు అందిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. త్వరలోనే పురుషోత్తపట్నం పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయని.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం, జనవరి 06: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత తమదేనంటూ ప్రచారం చేస్తున్న వైసీపీకి ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మంగళవారం విశాఖపట్నంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు. అందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకం సృష్టించి.. సంపద లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడన్నీ తామే చేశామని వైసీపీ నేతలు చెబుతారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
భోగాపురం ఏయిర్‌పోర్టు వల్ల మంచి జరుగుతుందని.. దీనిని స్వాగతించాలని వైసీపీ నేతలను తాను కోరుతున్నామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా సమస్యలు పరిష్కరించుకోవడానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయని గుర్తు చేశారు. బచావత్ ట్రైబునల్ కూడా సమావేశమైందన్నారు.
ఏదైనా రాష్ట్రాలో నీటి సమస్యలు, అభ్యంతరాలు ఉంటే.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతారని వివరించారు. ఆ సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించిందన్నారు. అలాగే పాత ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ముందుకు వెళ్తోందన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు కెనాల్ పూర్తి చేసి.. కుప్పం వరకు నీళ్లు అందిస్తామని ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. త్వరలోనే పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయని.. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. ఏపీ సమగ్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పర్యావరణ పరిరక్షణపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News