Minister Atchannaidu: కోనసీమ జిల్లా గ్యాస్ లీక్ ఘటన.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:16 PM
ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కోనసీమ జిల్లా , జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో గల మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి నిన్న(సోమవారం) గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఇరుసుమండలో పైప్‌లైన్ నుంచి గ్యాస్ ఎగజిమ్మింది. గ్యాస్ ఎగజిమ్మడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే, ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ఆరా తీశారు. ఇవాళ(మంగళవారం) ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని కలెక్టర్‌కు ఆదేశించారు. ఓఎన్‌జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక నిపుణులతో మంటలను అదుపులోకి తీసుకురావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 25 శాతం గ్యాస్ ప్రెజర్ తగ్గిందని మంత్రికి తెలిపారు అధికారులు. ఢిల్లీ నుంచి ఘటనాస్థలానికి నిపుణుల బృందం వచ్చిందని వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు వాటరింగ్ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈరోజు(బుధవారం) సాయంత్రానికి మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అవసరమైన చోట్ల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అవసరమైతే అదనపు వనరులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పర్యావరణ పరిరక్షణలో ఏపీకి కొత్త దిశ
వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన
Read Latest AP News And Telugu News