Tirupati Tragic incident: వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం.. సంచలనం కలిగిస్తున్న ఘటన
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:21 AM
తిరుపతి కొర్లగుంట మారుతీనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళని హత్య చేసిన అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి, జనవరి6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా కొర్లకుంట మారుతీనగర్‌లో జరిగిన దారుణ ఘటన (Tirupati Tragic incident) వెలుగులోకి వచ్చింది. సాంబలక్ష్మి(40) అనే మహిళను సోమశేఖర్(37) అనే వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కాగా, ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల దర్యాప్తు..
తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ స్వాతి బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలంలో మృతదేహాలను పరిశీలించారు. అనంతరం రుయా ఆస్పత్రి మార్చురీకి మృతదేహాలను తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. మరింత సమగ్రంగా ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
మహిళ హత్యకు కారణమిదేనా..
తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమశేఖర్ గుత్తివారిపల్లికి చెందిన వ్యక్తి. ఐదు సంవత్సరాలుగా కొర్లకుంట మారుతీనగర్‌లో గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. ఆయన తన భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్నాడు. అయితే, సాంబలక్ష్మి స్వస్థలం తెలంగాణ ఖమ్మం జిల్లా. అయితే ఆమె కొంతకాలం జీవకోనలో... ఆ తర్వాత కొర్లకుంట మారుతీనగర్‌లో తన భర్త, కుమారుడితో కలిసి జీవించేది. ఆమె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సమోసాల దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలోనే ఆ షాపునకు వచ్చిన సోమశేఖర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కొంతకాలంగా కొనసాగుతోంది.
రూమ్ కు రావాలని నమ్మించి..
సాంబలక్ష్మి, సోమశేఖర్ మధ్య ఇటీవల వివాదాలు పెరిగాయి. సోమశేఖర్‌తో వాగ్వాదం జరగడంతో ఆమె వివాహేతర సంబంధానికి నిరాకరించింది. దీంతో అతను తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. చివరిగా ఒకసారి తనతో మాట్లాడతానని సాంబలక్ష్మిని సోమశేఖర్ నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె సోమశేఖర్ ఉంటున్న రూమ్ కు వెళ్లింది. ఆ సమయంలోనే సాంబలక్ష్మిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. సాంబలక్ష్మి, సోమశేఖర్ మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి. ఈ పరిణామాలతో సోమశేఖర్‌కి వివాహేతర సంబంధం మానసిక భారంగా మారింది. అలాగే, వారిద్దరి మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు కూడా ఆమె హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాంబలక్ష్మిని హత్య చేసిన అనంతరం సోమశేఖర్ కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రజల్లో ఆందోళన
కొర్లగుంట మారుతీనగర్ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటనతో ఇరు కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎలాంటి అసత్యాలను నమ్మొద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే వేచి ఉండాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పోలీసుల ఆపరేషన్.. ఏం చేశారంటే.
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News