Share News

AP Police: ఏపీలో పోలీసుల ఆపరేషన్.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Jan 06 , 2026 | 08:36 AM

తిరుపతి జిల్లాలోని వడమాలపేట మండలంలో ఎస్ఐ హరీశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు.

AP Police: ఏపీలో పోలీసుల ఆపరేషన్.. ఏం చేశారంటే..
Illegal Ration Rice

తిరుపతి జిల్లా, జనవరి6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని వడమాలపేట మండలంలో ఎస్ఐ హరీశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. పుత్తూరు నుంచి వడమాలపేట మీదుగా రేణిగుంట వైపు అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఓ లారీలో తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈమేరకు పోలీసులు సోదాలు జరిపి భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.


అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద ఎస్ఐ హరీష్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఐచర్ లారీ (AP 21 TZ 7850)ను ఆపి తనిఖీ చేశారు. ఈ లారీలో 500 బస్తాలు, అంటే సుమారు 25 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు.


పట్టుబడిన రేషన్ బియ్యం

ఈ అక్రమ రేషన్ బియ్యం స్థానిక ఎమ్మార్వో , డీటీ అధికారులతో కలిసి పట్టుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యం స్థానిక ఎమ్మార్వో, డీటీ అధికారులకు అప్పగించారు. అనంతరం ఈ రేషన్ బియ్యాన్ని పుత్తూరు రేషన్ గోడౌన్‌కు తరలించారు.


లారీ డ్రైవర్ అరెస్టు

డ్రైవర్ సతీష్ (30), తండ్రి మనోహరన్ అనే వ్యక్తి తిరుత్తణి తాలూకా, తిరువల్లూరు జిల్లా (తమిళనాడు)కు చెందినవారిగా గుర్తించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.రేషన్ బియ్యాన్నిఅక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని ఎస్‌ఐ హరీశ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు

పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 08:37 AM