ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారు: ఎంపీ రమేశ్
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:37 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
ఢిల్లీ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(BJP MP CM Ramesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు. ఏపీలో కావాలనే జగన్ అండ్ కో అల్లర్లు సృష్టించారని ఫైర్ అయ్యారు. జగన్ కనుసన్నల్లోనే జోగి రమేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామన్నారు. అంబటి, జోగి రమేశ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు ఎంపీ.
జగన్‌ది డిస్ట్రక్టివ్ మోడ్..
సీఎం చంద్రబాబుది కన్‌స్ట్రక్టివ్ మోడ్.. జగన్‌ది డిస్ట్రక్టివ్ మోడ్ అని ఎంపీ రమేశ్ విమర్శించారు. కావాలనే వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని రమేశ్ ఫైర్ అయ్యారు. వైసీపీ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని సూచించారు. కూటమి నేతలు ఎవరూ తప్పు చేయొద్దని కోరారు. సీఎం చంద్రబాబు ఏపీలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు ఏపీలో సుపరిపాలన అందిస్తున్నారని వెల్లడించారు.
వైసీపీకి బడ్జెట్‌పై అవగాహన లేదు..
ఏపీలో ఉండే వైసీపీ నాయకులకు బడ్జెట్‌పై ఏ మాత్రం అవగాహన లేదని ఎంపీ రమేశ్ అన్నారు. మరోసారి వారు బడ్జెట్ పూర్తిగా చదువుకోవాలని సూచించారు. వైసీపీ నేతలకు ఎంతసేపూ దోచుకోవాలి, దాచుకోవాలనే ఆలోచనేనని ఎంపీ రమేశ్ విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్
మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
Read Latest AP News And Telugu News