Share News

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Feb 02 , 2026 | 08:04 AM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.

మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
Jogi Ramesh

విజయవాడ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై(Jogi Ramesh) ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్‌వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రమేశ్‌పై Cr.No.64/2026 U/s 196, 353 r/w 3(5) BNS (153A, 505 r/w 34 IPC) పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు.


జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో Cr.No.66/2026 U/s 189(2), 190, 292, 324(4) BNS (143, 149, 290, 427 IPC) సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇక జోగి నివాసంపై దాడిని పరిశీలించేందుకు వెళ్తుండగా జరిగిన అరెస్టులపై సైతం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మస్తాన్, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు. జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సుమోటోగా తీసుకుని ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు. అలాగే తెలుగుదేశం, వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. జోగి రమేశ్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబూరావుల పేర్లు కూడా నమోదయ్యాయి.


శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు Cr.No.67/2026 U/s 170 BNSS (151 Cr.P.C) పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. విధులకు ఆటంకం కలిగించారని ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసును ఫైల్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 09:18 AM