Home » Jogi Ramesh
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, చంపుతామని బెదిరించారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆయన కోడలు మేఘన ఫిర్యాదు చేశారు. లోక్‌భవన్‌లో బుధవారం గవర్నర్‌ను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు.
జగన్ జమానాలో మంత్రిగా పనిచేసిన జోగి రమేశ్ ‘ఘనకార్యాలు’ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నాడు జగన్ అండతో చెలరేగిపోయిన ఈ వైసీపీ నేత గుంటూరులో రూ.25-30 కోట్ల విలువైన ఇరిగేషన్ భూమిని చెరపట్టారు.
గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. జోగి రమేశ్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ సహా వారి కుటుంబసభ్యులకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన కుమారుడు వివాహం విషయంలో రెచ్చిపోయాడు.
‘‘అంతా మీరే చేశారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. మీరంతా కలిసి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. బ్రెయిన్‌వాష్ చేసి ఒత్తిడి తెచ్చినందునే నేను పెళ్లి చేసుకున్నా’’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ తన తల్లిదండ్రులపై మండిపడ్డారు.
‘నన్ను ఇంట్లో మూడో అంతస్తులో బంధించి ఉంచేవారు. ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్‌తో నిఘా పెట్టేవారు. నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించారు. వారు మతం మారిన విషయాన్ని దాచారు’ అని వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబంపై ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు మేఘన సంచలన వివరాలు వెల్లడించింది.
ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపులు, చీటింగ్, హత్యాయత్నం ఆరోపణలతో కేసు నమోదైంది. బాధితురాలు మేఘన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కథనంపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన పోలీసుల సూచనలను బేఖాతరు చేశారంటూ ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.