పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:45 AM
రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన పోలీసుల సూచనలను బేఖాతరు చేశారంటూ ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 7: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై(Former Minister Jogi Ramesh) నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Former CM YS Jagan Mohan Reddy) ఇటీవల ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా జోగి రమేష్ ఆధ్వర్యంలో.. వైసీపీ నేతలు బైక్ ర్యాలీ, భారీ జనసమీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాల వల్ల పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జన సమీకరణ చేయొద్దని అంతకుముందే జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పోలీసుల సూచనలను బేఖాతరు చేస్తూ మాజీ మంత్రి వ్యవహరించారని ఎస్ఐ రవి వర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జోగి రమేష్‌పై బైక్ ర్యాలీ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసు విధులకు ఆటంకం తీసుకురావడం వంటి ఆరోపణలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇవి కూడా చదవండి...
రేసు గుర్రాలు.. చైర్మన్ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు
ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..
Read Latest AP News And Telugu News