Home » NTR District
ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. 20 లక్షల రూపాయల డబ్బుకోసం కన్న కూతుర్ని అమ్మేశాడు. 43 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశాడు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు కొసాగుతున్నాయని కూటమి నేతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.
మానవతా దృక్పథంతో తమ ఇద్దరు కౌన్సిలర్ల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ వైసీపీ సభ్యులు చేసిన విజ్ఞప్తిని తిరువూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ తిరస్కరించారు. ఇద్దరు మహిళా కౌన్సిలర్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎజెండాలో అధికారులు పొందుపర్చారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27,28వ వార్షిక స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 9వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన స్నాతకోత్సవం జరగనుందని వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో అనధికార బెల్ట్ షాపుల హవా నడుస్తోంది. బడ్డీకొట్ల ముసుగులో భారీగా మద్యం అమ్మ కాలకు తెరలేపుతున్నారు. అధికారులు సహకరిస్తుండటంతో నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో రహస్యంగా నిర్వహించిన బెల్ట్ షాపులు నేడు..
ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగర ప్రజల కృషితోనే సెవన్ స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
కోస్తా జిల్లాలకే తలమానికంగా నిలుస్తున్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి రోజురోజుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పలు విభాగాల్లో మహిళా రోగులకు వైద్య పరీక్షలను పురుష సిబ్బందే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2డి ఎకో, ఈసీజీ టెస్టులను పురుష సిబ్బంది నిర్వహిస్తుండటంతో మహిళలు చెప్పలేని మానసిక వేదన ఎదుర్కొంటున్నారు.
బందర్ రోడ్డులో గురువారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బందర్ రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ గడ్డర్లు కుప్పకూలాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎవ్వరూ లేకపోవవడంతో పెను ప్రమాదం తప్పింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపు చాలా తక్కువగా ఉన్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో మంగళవారం ప్రస్తావించారు.