Share News

వివాహితపై అత్యాచార యత్నం.. బయటకుచెబితే చంపుతానంటూ బెదిరింపులు

ABN , Publish Date - Feb 09 , 2026 | 03:13 PM

ఎన్టీఆర్‌ జిల్లాలో వివాహితపై అత్యాచారయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయారు.

వివాహితపై అత్యాచార యత్నం.. బయటకుచెబితే చంపుతానంటూ బెదిరింపులు
NTR district

ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 9: ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు రూరల్ మండలంలోని ఎరుకోపాడు గ్రామంలో ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన సురగం శ్రీనివాసరావు అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే.. తనతో సహా భర్త, పిల్లలను చంపేస్తానని నిందితుడు బెదిరించాడని బాధితురాలు వాపోయారు. ఈ ఘటనపై.. భర్త ఎరువ బ్రహ్మం, గ్రామపెద్దల సహకారంతో గత బుధవారం తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారామె.


అయితే.. ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తమకు సరైన న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన చెందారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని భర్త డిమాండ్ చేశారు. తిరువూరు పోలీసులు చిన్నపాటి సెక్షన్లు మాత్రమే పెట్టి.. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరిపి, నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఏపీఎస్‌ ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు..

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.. ఫలితాలే ముఖ్యమన్న డిప్యూటీ సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 09 , 2026 | 04:40 PM