Share News

ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు..

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:09 PM

ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..

ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు..
CM Praise APSRTC

అమరావతి, ఫిబ్రవరి 9: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమీక్షా సమావేశంలో స్త్రీ శక్తి పథకం విజయవంతమైన అమలుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (APSRTC) సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఏపీఎస్‌‌ఆర్టీసీ పనితీరుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ ప్రశంసలపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి.. తమకు బాధ్యత మరింత పెరిగిందన్నారు.


స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 4 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సేవలను ఏపీఎస్‌‌ఆర్టీసీ విజయవంతంగా అందించిందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్త్రీ శక్తి పథకాన్ని కేవలం బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరించి సేవలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలను మహిళలకు అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.. ఫలితాలే ముఖ్యమన్న డిప్యూటీ సీఎం

నల్లమల అడవుల్లో పెద్దపులి భయం.. వాగులోకి దూసుకెళ్లిన వాహనం..


Read Latest AP News And Telugu News

Updated Date - Feb 09 , 2026 | 04:27 PM