తిరుమలేశుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:25 AM
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.