ABN Andhrajyothy Effect: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు
ABN , Publish Date - Oct 10 , 2025 | 02:44 PM
NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు కొసాగుతున్నాయని కూటమి నేతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్: ABN ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన NTTPS అధికారుల దృశ్చర్య వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు కృష్ణా నదిలో కలుస్తున్న బూడిద నీటిని విజయవాడ ఆర్డీవో పరిశీలించారు. NTTPS నుంచి పెద్ద ఎత్తున కూలింగ్ కెనాల్ వాటర్‌లో బూడిద కలవడంతో 104 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కూలింగ్ కెనాల్ దగ్గర పైపులైన్‌ను అధికారులు, కూటమి నేతలు పరిశీలించారు.
NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు కొసాగుతున్నాయని కూటమి నేతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల త్యాగాలను విద్యుత్ శాఖ, జెన్కో ఎప్పటికీ మర్చిపోదని గుర్తు చేశారు. బూడిద తరలింపు కోసం లోడింగ్ ఉచితంగా చేయడంతో పాటు రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కోల్డ్ స్టోరేజ్ షెడ్‌ను నిర్మిస్తున్నామన్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..