Share News

Drugs Seized in Eagle Team: హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:40 AM

ఐడీఏ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం అధికారుల దర్యాప్తు శుక్రవారం కూడా కొనసాగుతోంది. పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీని సీజ్ చేశారు ఈగల్ టీం అధికారులు.

Drugs Seized in Eagle Team:  హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
Drugs Seized in Eagle Team

హైదరాబాద్, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): ఐడీఏ బొల్లారం (IDA Bollaram)లోని పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం (Eagle Team) అధికారుల దర్యాప్తు ఇవాళ(శుక్రవారం) కూడా కొనసాగుతోంది. పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ (PNM Life Sciences Company) కంపెనీని సీజ్ చేశారు ఈగల్ టీం అధికారులు. నిన్న(గురువారం) జీడిమెట్లలో సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలో సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్‌పై దాడి చేశారు ఈగల్ టీం అధికారులు. రూ.72 కోట్ల విలువ చేసే 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు ఈగల్ టీం అధికారులు.


ఈ డ్రగ్స్ కేసు(Drug Bust Case)లో నలుగురు నిందితులని అరెస్టు చేయగా, మరోకరు పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు శివ రామకృష్ణతో పాటు, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబులని అరెస్ట్ చేశారు ఈగల్ టీం (Eagle Team) అధికారులు. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడు శివరామకృష్ణకి గతంలో పలు కెమికల్ కంపెనీల్లో కెమిస్టుగా పని చేసిన అనుభవం ఉంది. గతంలో రెండుసార్లు డ్రగ్స్ కేసులో శివరామకృష్ణ అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలయ్యాడు. శివరామకృష్ణ తాను చేస్తున్న ఉద్యోగం మానేసి ఆక్వా బిజినెస్ చేస్తూ డ్రగ్స్ తతయారీకి ప్లాన్ చేశాడు. శివరామకృష్ణ ఇచ్చిన ఫార్ములా ఆధారంగానే అనిల్ డ్రగ్స్ తయారు చేసినట్లు ఈగల్ టీం అధికారులు చెబుతున్నారు. పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో అనిల్ ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఏడో తరగతి చదివిన దొరబాబు వాల్ పెయింటర్‌గా పని చేశాడు. 2018 తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్‌కి వచ్చి పలు కంపెనీలో హెల్పర్‌గా పనిచేశాడు దొరబాబు. అయితే నిందితులని అరెస్ట్ చేసి ఈగల్ టీం అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 11:13 AM