Share News

Hyderabad Harassment Case: లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 10 , 2025 | 08:56 AM

వాలీబాల్ కోచ్ అంబాజీ అనే వ్యక్తి వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో జరిగింది.

Hyderabad Harassment Case: లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్య
Hyderabad Harassment Case

హైదరాబాద్, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): వాలీబాల్ కోచ్ (Volley ball Coach) అంబాజీ అనే వ్యక్తి వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని (Degree Student) ఆత్మహత్యకి పాల్పడింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో మౌలిక(19)అనే యువతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది.


అదే కళాశాలలో వాలీబాల్ కోచ్‌గా చేరి, తనను ప్రేమించాలని యువతిని వేధిస్తున్నాడు అంబాజీ. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మౌలిక. యువతి తండ్రి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 09:41 AM