Sankranti Effect: ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్‌స్టేషన్లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:20 PM
సంక్రాంతి పండుగ ముగిసింది. దీంతో సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు.. నగరాలకు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా, జనవరి18: సొంత గ్రామాల్లో సంక్రాంతి(Sankranti Festival) పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల బస్ స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. వివిధ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూళ్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకే ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
మరోవైపు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై(Vijayawada-Hyderabad Highway) వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై-జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. సర్వీస్ రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేశారు. ఆ ప్రాంతంలో తాత్కాలిక రోడ్లను వేశారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగుతోంది. వాహనాల సంఖ్య పెరిగినా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణాలు ముందుకు సాగుతున్నాయి. అధికారులు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో ట్రాఫిక్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు