Pawan Kalyan: డా. భీమన్న ఖండ్రే ఆత్మకు శాంతి చేకూరాలి: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:13 PM
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ భీమన్న ఖండ్రే మృతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
అమరావతి, జనవరి 17: కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ భీమన్న ఖండ్రే(Dr Bhimanna Khandre) మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సంతాపం తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
పవన్ ట్వీట్ ఇదే..
‘కర్ణాటక రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, మిత్రులు ఈశ్వర్ ఖండ్రే తండ్రి(మాజీ మంత్రి), ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డా.భీమన్న ఖండ్రే మృతికి చింతిస్తున్నాను. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని తెలిసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వాతంత్ర్య సమరంలో, హైదరాబాద్ కర్ణాటక విముక్తి, కర్ణాటక సమైక్యత ఉద్యమాల్లో డా.భీమన్న ఖండ్రే కీలక పాత్ర పోషించారు. ఈశ్వర్ ఖండ్రేకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ ట్వీట్ చేశారు.
కాగా.. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భీమన్న ఖండ్రే(102) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా గత అర్ధరాత్రి బీదర్ జిల్లా భాల్కి పట్టణంలోని తన నివాసంలో ఖండ్రే తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో పాటు రక్తపోటు సమస్యలతో ఆయన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా ఖండ్రే పనిచేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
Read Latest AP News And Telugu News