NTR District: యువకుడిపై కుక్కర్‌తో మూకుమ్మడి దాడి.. ఎందుకంటే?
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:42 PM
ఎన్టీఆర్ జిల్లాలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి .. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా, జనవరి 1: జిల్లాలోని గంపలగూడెం మండలం తోటమూలలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడి దాడి చేశారు. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మైక్ సౌండ్ తగ్గించమన్నందుకు సదరు వ్యక్తులు ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయడిన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
తోటమూల గ్రామానికి చెందిన బజ్జూర్ హరికృష్ణ బిర్యానీ పాయింట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తోటమూల చర్చిలో పెద్దగా సౌండ్ రావడాన్ని గమనించిన హరికృష్ణ.. మైక్ సౌండ్ తగ్గించాలని వారిని కోరాడు. ఇదే అతడిని ఆస్పత్రిపాలయ్యేలా చేసింది. మైక్ సౌండ్ తగ్గించమన్న పాపానికి కొందరు వ్యక్తులు గత అర్ధరాత్రి ఇంట్లో ఉన్న హరికృష్ణపై కుక్కర్‌తో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిని అడ్డుకోబోయిన కుసుమరాజు రాజశేఖర్‌పై కూడా ఆ యువకులు దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. యోహాన చర్చి పాస్టర్ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి నిరసనగా వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తోటముల ప్రధాన రహదారిపై బాధితుల కుటుంబసభ్యులు రాస్తారోకో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయిందిగా
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దారుణం..
Read Latest AP News And Telugu News