Eluru News: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై దారుణం..
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:55 PM
ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆపై కొత్తగా కాపురం మొదలుపెట్టారు. కానీ అంతలోనే
ఏలూరు జిల్లా, జనవరి 1: అందరి ప్రేమలు గెలుపుకు దారి తీయవు. కొందరు పోరాడి తమ ప్రేమను సాధించుకుంటే.. మరికొన్ని ప్రేమలు మాత్రం విషాదంగా ముగుస్తాయి. పెద్దలను కాదని ప్రేమించుకున్న జంటల పరిస్థితి ఒక్కోసారి దారుణంగా ఉంటుంది. యువతి కుటుంబసభ్యులో లేదా యువకుడి ఫ్యామిలీ మెంబర్స్ వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి హత్య చేసేందుకు కూడా వెనకాడారు. ఇలాంటి ఘటన ఎన్నో చూశాం. అలాగే ప్రేమికుడిపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన సంఘటనలు అనేకం. ఏలూరు జిల్లాలో కూడా ఇలాంటిది జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట పట్ల యువతి కుటుంబసభ్యులు దారుణంగా ప్రవర్తించారు. ఏం జరిగిందంటే..
జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటలో దారుణం జరిగింది. కూతురిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని యువకుడుని యువతి బంధువులు స్తంభానికి కట్టేశారు. గుడిలో ప్రేమించి పెళ్ళి చేసుకుని కొత్త కాపురం మొదలు పెట్టిన ప్రేమ జంటపై యువతి కుటుంబసభ్యులు కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. మండవల్లి మండలానికి చెందిన సాయిచంద్, దుర్గా గత ఎనిమిదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఆలయంలో ప్రేమ జంట వివాహం చేసుకుంది.
ముసునూరు మండలంలో పోస్టల్ శాఖలో విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెళ్లి గురించి తెలిసన యువతి బంధువులు.. దుర్గా, సాయి చంద్‌లపై ఒక్కసారిగా దాడి చేశారు. సాయి చంద్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆపై కూతురు దుర్గాను తీసుకుని యువతి కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లిపోయారు. సాయి చంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్, దాడి సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. దుర్గ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై
ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయిందిగా
Read Latest AP News And Telugu News