ఇప్పటి వరకూ మెట్ట, అటవీ ప్రాంతాల్లోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ కంటిపై కునుకు లేకుండా చేసే పెద్ద పులి ఇప్పుడు మాగాని భూములపై వచ్చింది.
ఏలూరు నగరంలో 1934 నుంచి ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న గోవుల సంరక్షణ సమితిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారశైలి, ఒంటెద్దు పోకడలపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వ డంతో రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలు, జిల్లా పరిషత్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.
రిజర్వ్ బ్యాంకు రెపో రేటు పెంపుతో ప్రజలపై వడ్డీ పిడుగు పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులపై నెలకు రూ.16.68 కోట్ల మేర అదనపు భారం పడనుంది. నాలుగేళ్ల తరువాత ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే తల్లిదండ్రుల ఆశలకు స్కూల్ బస్సుల భద్రత తూట్లు పొడు స్తోంది. కొన్ని విద్యాసంస్థల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల పనితీరు, నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఇటీవల గుర్తించిన కరువు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన రైతులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రోడ్లు, భవ నాలశాఖ ఏలూరు సర్కిల్ పరిధిలోని వివిధ కేడర్లలోని ఉద్యోగులు వర్క్ ఎరేంజ్‌మెంట్ పేరుతో తమకు అనుకూల స్థానాల్లో కొనసాగుతున్న వారి ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.విజయరత్నం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం త్వరితిగతిన న్యాయం చేయడా నికి చర్యలు చేపట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐదుగు రు సభ్యులతో కూడిన మంత్రుల కమిటీని అగ్రిగోల్డ్ డిపాజిట్‌ల సమస్యలు పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
వేంకటేశ్వరస్వామి ఆలయంలో 15 రోజులకు నిర్వహించిన హుండీల సొమ్ము లెక్కింపులో రూ.1,27,88,160 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.