Share News

పచ్చటి రోడ్లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:20 AM

ఏలూరులోని సీఆర్‌ఆర్‌ రెడ్డి కళాశాల, వట్లూరు, మినీ బైపాస్‌, పోస్టల్‌ కాలనీ మధ్య రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు కనువిందు చేస్తున్నాయి.

పచ్చటి రోడ్లు
వట్లూరు వద్ద రోడ్డుపై గొడుగులా చెట్లకొమ్మలు

కింద హాయిగా సాగే ప్రయాణం..ఏలూరులో అద్భుత దృశ్యం

కిలోమీటరు మేర పచ్చదనం.. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్న ప్రజలు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఏలూరులోని సీఆర్‌ఆర్‌ రెడ్డి కళాశాల, వట్లూరు, మినీ బైపాస్‌, పోస్టల్‌ కాలనీ మధ్య రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. సుందర ప్రకృతి దృశ్యంతో మది పులకించిపోతున్నది. మనం ప్రయాణించే రహదారిలో ఓ చెట్టు నీడ రాగానే పచ్చదనం తగిలి హాయిగా అనిపిస్తుంటుంది. అనేక చెట్లు రహదారికి ఇరువైపులా పచ్చని పందిరేసి చల్లటి నీడనిస్తే ఇంకేముంది అప్పటి వరకు పడిన ప్రయాణ బడలిక కాస్త ఇట్టే ఎగిరిపోతుంది. రోడ్డు ఎక్కితే చాలు ఒకటే దుమ్ము, దూళి, ఎందుకొచ్చాం రా బాబు రోడ్డుపైకి అనుకునేలోనే మనం ప్రయాణించే రహదారిలో ఓ చెట్టు నీడ రాగానే పచ్చదనం తగిలి హాయిగా అనిపిస్తుం టుంది. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాల రోడ్డు డివైడర్‌కు ఇరువైపులా పచ్చని పందిరిలా అల్లుకున్న చెట్లు కొమ్మలు, పోస్టల్‌ కాలనీ బైపాస్‌ రహదారికి ఇరువైపులా ఎత్తైన చెట్లు కనువిందు చేస్తున్నాయి. ఏపుగా పెరిగిన కొమ్మలతో రహదారి మొత్తం పచ్చని పందిరి వేసినట్లు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. మంచి నీడనిస్తున్నాయి. శిశిర ఋతువు ఆ చెట్లకు మరింత శోభను ఇచ్చాయి. వాహన చోదకులు అక్కడికి రాగానే ఓ మధురాను భూతి ని పొందేలా చేస్తున్నాయి. ఇక్కడి రహదారిని పందిరిలా అల్లుకున్న చెట్లు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్లు వెంబడి ఇలా మొక్కలు పెరిగితే మన ఊరు మంచి పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతుందని ఇలాంటి దృశ్యాలు ప్రతి రోడ్డుకు ఇరువైపులా కనిపించాలని ఆశిద్దాం.

Updated Date - Feb 24 , 2026 | 12:20 AM