Share News

సీసీ కెమెరాల నిఘా నీడలో..

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:18 AM

సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

సీసీ కెమెరాల నిఘా నీడలో..
సెయింట్‌ థెరిసా బాలికల కళాశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు..

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

తొలిరోజు పరీక్షలకు 94శాతం హాజరు

ఏలూరు అర్బన్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున జరిగిన ప్రథమ సంవత్సరం తెలుగు/ సంస్కృతం/హిందీ/ఉర్దూ–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 17,864 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 16,850 మంది (94శాతం) హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 15,479 మందికి 14,839, ఒకేషనల్‌ విభాగంలో 2,385 మందికి 2,011 మంది హాజరయ్యారు. మొత్తం మీద 1,014 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘట నలు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా ముగి శాయని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో యోహాన్‌ తెలి పారు. జిల్లాలో పరీక్షలు జరుగుతున్న 56 కేంద్రా ల్లోని అన్ని గదుల్లో అమర్చిన సీసీ కెమెరాలు ఏలూరులోని ఆర్‌ఐవో కార్యాలయానికి అను సంధానం చేయగా, పరీక్షలు జరుగుతున్న తీరును ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌లో జిల్లా అధికారులు పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ సమస్యలు తలెత్తకుండా చీఫ్‌ సూపరింటెండెంట్లు సిబ్బందిని నియమించారు. ముఖ్యంగా కుక్కు నూరు, వేలేరుపాడు, తదితర ఏజెన్సీ మండలా ల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌లను వినియోగించారు. తొలి సారిగా ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న ప్రథమ సంవ త్సరం విద్యార్థులను వెంటబెట్టుకుని తల్లిదండ్రు లు తోడుగా రావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. కలెక్టర్‌ వెట్రిసెల్వి ఏలూ రులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పకడ్బం దీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

ఏలూరు క్రైం : ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పోలీస్‌ శాఖ పటిష్ఠ చర్యలను చేపట్టింది. విద్యార్థులు ఎవరైనా సమయానికి చేరుకోలేకపోతే వారికి తక్షణం పోలీసు సహాయాన్ని అందించడానికి బ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీక రణకు ఆర్ముడురిజర్వు పోలీస్‌ సిబ్బందిని నియ మించారు. ఎస్పీ కిశోర్‌ ఏలూరు నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌ స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ రావు, త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:19 AM