పవన్ కల్యాణ్ చొరవ.. ఏలూరు జిల్లాలో దశాబ్దాల సమస్యకు పరిష్కారం..
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:19 PM
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ.లక్షల వ్యయంతో 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం, రైతుల పంటలకు సులభతరంగా మారింది..
ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రవాణా సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (PawanKalyan) పరిష్కారం చూపారు. కేవలం మూడు నెలల్లోనే ఈ డొంక రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చొరవతో 3 కిలోమీటర్ల డొంక రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ.లక్షల వ్యయంతో 12,500 మంది ప్రజలకు రవాణా సౌకర్యం కలగడంతో పాటూ రైతులకు ప్రయోజనకరంగా మారింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఎర్రంపేట – రాజవరం మధ్య నిర్మించిన 3 కిలోమీటర్ల డొంక రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. ఈ కొత్త రోడ్డు నిర్మాణంతో స్థానికులకు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి, వ్యవసాయ పరికరాలను తీసుకెళ్లడానికి ఇది ఎంతో సులభతరంగా ఉండనుంది. పండిన పంటను పొలం నుంచి ఇంటికి లేదా మార్కెట్‌కు తక్కువ ఖర్చుతో, వేగంగా తరలించే అవకాశం కలిగింది.
గతంలో బురదమయంగా ఉన్న ఈ దారి ఇప్పుడు రాకపోకలకు అనువుగా మారడంతో వేలాది మంది ప్రజల రవాణా కష్టాలు తీరాయి. ఉపాధి హామీ పథకం నిధులను (రూ. లక్షల వ్యయంతో) సరైన రీతిలో వినియోగించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయం, పవన్ కల్యాణ్ పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు
ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..
Read Latest Telangana News And AP News And Telugu News