Share News

విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్‌ విక్రయాలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:26 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఔషధ దుకాణా లపై ఏలూరు రీజియన్‌(జోన్‌–2) పరిధిలోని పూర్వపు ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఔషధ నియంత్రణా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు సోమవారం మూకుమ్మడిగా ఆకస్మిక తనిఖీ లు చేశారు.

విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్‌ విక్రయాలు
ఏలూరు భారత్‌ మెడికల్స్‌లో తనిఖీలు చేస్తున్న ఏడీలు, డీఐలు

ఉమ్మడి పశ్చిమ వ్యాప్తంగా మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు.. పలు అంశాలు నిర్ధారణ

ఏలూరుఅర్బన్‌/జంగారెడ్డిగూడెం/ తణుకు/భీమవరం క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఔషధ దుకాణా లపై ఏలూరు రీజియన్‌(జోన్‌–2) పరిధిలోని పూర్వపు ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఔషధ నియంత్రణా విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు సోమవారం మూకుమ్మడిగా ఆకస్మిక తనిఖీ లు చేశారు. మొత్తం 44 రిటైల్‌ ఔషధ దుకాణాల్లో జరిపిన దాడుల్లో వినియోగదారులకు విక్రయించిన ఔషధాలకు బిల్లులు ఇవ్వకపోవడం, డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా యాంటీ బయాటిక్స్‌ మందులను విక్రయి స్తుండటం, తదితర ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టుగా నిర్ధారణకు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలు షాపులపై డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ నిబంధనల మేరకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రాంతీయ డ్రగ్‌ కంట్రోల్‌(అడ్మినిస్ట్రేషన్‌) డిప్యూటీ డైరెక్టర్‌ ఏ.టీ.వీ. రమాదేవి వెల్లడిం చారు. జంగారెడ్డిగూడెం, ఏలూరు, భీమవరంలోని దుకాణాల్లో నిర్వహిం చిన ఈ ఆకస్మిక తనిఖీల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఒంగోలు, పశ్చిమ గోదావరి జిల్లాల ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు శ్రీరామ్మూర్తి, లక్షణ్‌, జ్యోతి, మరో 14 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొ న్నారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపుల యజమానులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌పై మాత్రమే మందులు కొనుగోలు చేయాలని, అలాగే కొనుగోలు చేసిన మందులకు బిల్లులను పొందాల్సిన బాధ్యతను కూడా పాటించాలని కోరారు. ఆకస్మిక దాడులు/తనిఖీలు ఇకమీదట కూడా కొనసాగుతాయన్నారు.

తణుకు పట్టణంలో..

తణుకు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు మెడికల్‌ షాపుల్లో ఔషధ నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని పది మెడికల్‌ షాపులను రాజ మండ్రి రూరల్‌ ఔషధ నియంత్రణ అధికారిణి పి.కల్యాణి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆయా షాపుల్లో ప్రధానంగా అబార్షన్‌ కిట్‌లు, మత్తులు అమ్మకాలు తనిఖీలు చేశారు. ఇంకా కొన్ని షాపులలో డ్రగ్స్‌, కాస్మోటిక్స్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిపారు. ఫార్మాసిస్టులు లేకపోవడం, ప్రిస్కిప్షన్లు లేకుండా మందులు అమ్మడం వంటి వాటిని గుర్తించినట్లు వివరించారు. చిన్నచిన్న లోపాలు గుర్తించిన ఆయా షాపులకు షోకాజ్‌లు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

జంగారెడ్డిగూడెం పట్టణంలో...

జంగారెడ్డిగూడెం: ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.పాండురంగ ప్రసాద్‌ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం పలు మెడికల్‌ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. సాధారణ తనిఖీలలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపా లన శాఖ ఇన్చార్జి డిజీ సౌరబ్‌గౌర్‌ ఆదేశాల మేరకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో పలు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.శ్రీరామమూర్తి తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. పాండురంగ ప్రసాద్‌ మాట్లాడుతూ మెడికల్‌ షాపులు నిర్వహించే వారంతా ప్రజలకు నాణ్యమైన మందులు ఇచ్చి ప్రజల్లో నమ్మకం కలి గించేలా వ్యవహరించాలన్నారు. ఇదిలా ఉండగా ఒక పక్క పలు మెడి కల్‌ షాపుల్లో అధికారుల తనిఖీలు జరుగుతుండగా మరికొంతమంది తమ షాపులను మూసివేయడం విశేషం.

భీమవరం పట్టణంలో...

భీమవరం క్రైం: ఏలూరు రీజియన్‌ ఉప సంచాలకుల ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని పలు మెడికల్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిం చినట్టు భీమవరం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అబిద్‌ ఆలీ తెలిపారు. కొన్ని మెడికల్‌ షాపుల్లో డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గమనించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:26 AM