Share News

వారాణసి.. కూత కూసేనా.?

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:34 AM

కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో జిల్లాకు మూడు కొత్త రైళ్లు వచ్చాయి. అందులో చెన్నైకు వందేభారత్‌ ప్రధానమైనది కాగా హుబ్లీకి వెళ్లే అమరావతి, అరుణాచలం వెళ్లే వీక్లీ స్పెషల్‌ ఒకటి ఉన్నాయి.

వారాణసి.. కూత కూసేనా.?

నరసాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో జిల్లాకు మూడు కొత్త రైళ్లు వచ్చాయి. అందులో చెన్నైకు వందేభారత్‌ ప్రధానమైనది కాగా హుబ్లీకి వెళ్లే అమరావతి, అరుణాచలం వెళ్లే వీక్లీ స్పెషల్‌ ఒకటి ఉన్నాయి. ఈ మూడు రైళ్లను తీసుకురావడంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కృషి ఉంది. దేశంలోనే తొలిసారిగా బ్రాంచ్‌ లైన్‌లో వందేభారత్‌ రైలు మన జిల్లాలోనే నడుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి రైల్వే జీఎం నరసాపురం స్టేషన్‌ను సందర్శించినప్పుడు డబ్లింగ్‌ లైన్‌ పూర్తికాగానే నరసాపురం నుంచి వారాణసికి రైలు నడుపుతామని ప్రకటించారు.దీంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్ర విభజన తరువాత కేటాయించిన రైలు విశాఖ వెళ్లిపోయింది. ప్రస్తుతం వారాణసికి విశాఖ నుంచి నడుస్తున్న రైలు విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసు లకు మాత్రమే అనుకూలంగా ఉంది. జిల్లావాసులు కాశీ వెళ్లాలంటే విజయవాడ వెళ్లి కేరళ, చెన్నై, బెంగూళూరు నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయిం చాల్సి వస్తున్నది. దీనివల్ల టిక్కెట్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతు న్నారు. ఈ సమస్యను కేంద్రమంత్రి వర్మ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రైల్వే మంత్రితో చర్చించారు. విశాఖ నుంచి నడుస్తున్న రైలును నరసాపురం వరకు పొడిగించాలని విన్నవించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు సరిహద్దునున్న కృష్ణా జిల్లా ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని రైల్వేశాఖకు వివరించారు. ఇప్పటికే పలుమార్లు రైల్వే ఉన్న తాధికారుల్ని కలిసి దీనిపై మాట్లాడారు. త్వరలో జిల్లా నుంచి వారాణసికి రైలు నడుస్తుందని చెప్పడంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ రైలు పట్టాలెక్కితే విశాఖ వెళ్లే ప్రయాణికులకు కూడా కష్టాలు తీరుతాయి. నరసాపురం, భీమవరం నుంచి నేరుగా విశాఖ ప్రయాణించవచ్చు.

Updated Date - Feb 24 , 2026 | 12:34 AM