Share News

సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నలుగురి హత్య కేసు కొట్టివేత

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:29 AM

రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెట్రోల్‌ పోసి నలుగురిని హతమార్చిన కేసులో సరైన సాక్ష్యాదారాలు లేక పోవడంతో కేసును కొట్టి వేస్తూ ఏలూరులోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు.

 సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నలుగురి హత్య కేసు కొట్టివేత

సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నలుగురి హత్య కేసు కొట్టివేత

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెట్రోల్‌ పోసి నలుగురిని హతమార్చిన కేసులో సరైన సాక్ష్యాదారాలు లేక పోవడంతో కేసును కొట్టి వేస్తూ ఏలూరులోని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు. నిందితుల తరపున న్యాయ వాదులు ఎంవీ నారాయణరాజు, పీఎస్‌ఎన్‌రావులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017 నవంబరు 25న తడికలపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వీరిశెట్టిగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టి హతమార్చారు. ఈ ఘటనపై తడికలపూడి పోలీసులు ప్రధాన నిందితుడిగా కేతా నాగేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మందిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసు ఏలూరులోని ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగింది. నిందితులపై నేరం రుజువు కాక పోవడంతో కేసును కొట్టివేస్తూ తొమ్మిది మంది నిందితులను విడుదల చేస్తూ న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు

Updated Date - Feb 24 , 2026 | 12:29 AM