Share News

అధ్యక్షా..

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:38 AM

విపత్తులను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.. గత ఏడాది మొంథా తుపాన్‌ సమ యంలో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సారధ్యంలో స్పం దించిన తీరుపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అధ్యక్షా..

విపత్తుల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

విపత్తులను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.. గత ఏడాది మొంథా తుపాన్‌ సమ యంలో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సారధ్యంలో స్పం దించిన తీరుపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు ఎనిమిది వేల హెక్టార్లలో పంట నష్టం ఏర్పడి దాదాపు 20 వేల మంది రైతులు నష్టపోయారు. దీనికి సుమారు రూ.20 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించి రైతులను ఆదుకున్నాం. విపత్తుల శాఖ ద్వారా ప్రత్యేక నిధులను కేటాయించి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఆరిమిల్లి రాధాకృష్ణ , ఎమ్మెల్యే, తణుకు

యనమదుర్రు డ్రెయిన్‌ ప్రక్షాళన చెయ్యాలి

భీమవరం పట్టణం నడి బొడ్డు నుంచి వెళుతున్న యనమ దుర్రు డ్రెయిన్‌ను ప్రక్షాళన చెయ్యాలి. ఈ డ్రైన్‌ సుమారు 50 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. డ్రైన్‌ వెంబడి ఉండే స్లూయిస్‌లు పని చేయకపోవడంతో వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇటీవల కిక్కస కూడా పెరిగిపోయింది.జిఅండ్‌వీ కెనాల్‌ కూడా పట్టణం నుంచే వెళుతుంది.ఈ వంతెనపై బ్రిడ్జి నిర్మించాలి. డబుల్‌ లైన్‌ బ్రిడ్జి అయితే మంచిది..

పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్యే, భీమవరం

భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్‌

విడుదల చేయాలి

గత ప్రభుత్వం కార్మిక వెల్ఫేర్‌ ఫండ్స్‌ నిధులు వేరే పఽథకాలకు మళ్లించి తీవ్ర అన్యాయం చేసింది గత ప్రభుత్వంలో 2022 వరకు 42 వేల క్లైమ్స్‌కు రూ.111 కోట్లు బకాయలు ఉన్నాయి. ఈ నిధులు విడుదల కాక భవన నిర్మాణ కార్మాకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిధులు విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలి. వెల్ఫేర్‌ బోర్డులో రూ.1200 కోట్లు నిల్వ ఉన్నాయని, ఇప్పటికి కూడా సెస్‌ నుంచి వచ్చిన సొమ్ములు కూడా వెల్పేర్‌ బోర్డులో జమవుతున్నాయి. ఇలాంటి సమయంలో కార్మికులను ఆదుకుని వీరిని కష్టాల నుంచి బయట పడేయాలి.

బొలిశెట్టి శ్రీనివాస్‌, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే

–తణుకు/ భీమవరం టౌన్‌/తాడేపల్లిగూడెం (ఆంధ్రజ్యోతి)

Updated Date - Feb 24 , 2026 | 12:38 AM