సేనలో జోష్!
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:17 AM
కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు పండుగకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. రాబో యే స్థానిక సమరానికి సన్నద్దమయ్యేం దుకు సంకల్పిం చారు. ఈ నెల 26 నుంచి మార్చి 10 వరకు ఊరూరా పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని జిల్లా నేతలకు ఆదేశాలందాయి.
26 నుంచి మార్చి 10 వరకు పార్టీ సభ్యత్వ నమోదు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు పండుగకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. రాబో యే స్థానిక సమరానికి సన్నద్దమయ్యేం దుకు సంకల్పిం చారు. ఈ నెల 26 నుంచి మార్చి 10 వరకు ఊరూరా పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని జిల్లా నేతలకు ఆదేశాలందాయి.
జనసేన పార్టీ ఐదో విడత సభ్యత్వ నమో దులో జిల్లాలో పార్టీ కార్య కర్తలు, శ్రేణుల్లో జోష్ నింపాలని నియోజకవర్గ కన్వీనర్లు, ఎమ్మెల్యేలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 26 నుంచి మార్చి 10వ తేదీ వరకు సభ్యత్వ నమోదును విజయవంతం చేయడానికి నేతలు సమాయత్తం అవుతున్నారు. గతేడాది మొత్తం 40 వేల మందికి సభ్యత్వాలు ఇచ్చినట్లు చెబు తున్నారు. ఈ ఏడాది ఎలా రెట్టింపు చేయా లన్న యోచనలో పార్టీశ్రేణులు కసరత్తు ప్రారం భించాయి.
స్థానిక సమరమే ధ్యేయంగా..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నేతలు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీ అధి నేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను పార్టీ కేడర్ ఉత్సా హంగా విజయవంతం చేస్తూనే ఉన్నారు.
ఏలూరు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ విజయ వాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు రెట్టింపు సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏలూ రు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ డివిజన్లలో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే టీడీపీకి, ఇతర పక్షాలకు తన చర్యలతో సంకేతాలిచ్చారు.పోలవరం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజులు పోటీపడి సభ్యత్వాల నమోదుపై దృష్టి కేంద్రీకరించా రు. స్థానిక పోరులో వారి అనుచరగణం, ముఖ్య నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా నిలిపేందుకు పావులు కదుపుతున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో పార్టీ నియో జకవర్గ కన్వీనర్ లేకపోయినప్పటికి అక్కడ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇటీ వల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కొల్లేరులో ఎక్కువ మందితో సభ్యత్వాల నమోదు చేయించడానికి ఉవ్విళూరుతు న్నారు. దెందులూరులోను జనసేన నుంచి గుర్తింపుతో రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకట లక్ష్మి కూడా భారీగానే సభ్యత్వాలను నమోదు చేయించాలన్న యోచనలో ఉన్నారు. కొల్లేరు ప్రజల సమస్యలపై ఎలుగెత్తి చాటుతూ.. ఇక్కడ బస్సు రాకపోకల సమస్యలు, రోడ్లపైన ఆమె ప్రజాప్రతినిధులకు వివరిస్తూ, మంత్రి లోకేశ్‌ను కలిసి ఇటీవల పలు సమ స్యలను ప్రస్తావించారు. చింతలపూడిలో మేకా ఈశ్వరయ్య, నూజి వీడులో బర్మా ఫణిబాబు సభ్యత్వం జోరు పెంచేలా పావులు కదుపుతున్నారు. పార్టీలో ఎక్కువగా నేతలంతా బీసీలకు చెందిన వారు కావడంతో.. ఇతర వర్గాలను ఆకర్షించ డానికి పొరుగు జిల్లాల నుంచి ఇతర నేతలు ఇక్కడ ఇన్‌చార్జులుగా రావడానికి అవకాశం ఉంది.
ప్రమాద బీమాపై చైతన్యం
అన్ని పార్టీల కంటే సభ్యత్వ నమోదుకు ఎక్కువగా వసూలు చేసే పార్టీ గా జనసేన నిలిచింది. అయితే ఈసారి రూ.500గా ఉన్న సభ్యత్వ రుసుంను రూ.400కు తగ్గించారు. కార్యకర్తలు, కీలకనేతలు సభ్యత్వ నమోదుతో ప్రమాద బీమా రూ.ఐదు లక్షలు అందజేత పైనే కార్యకర్తల్లో అవగాహనకు చర్యలు చేపట్టారు. ఈసారి నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేసే ముఖ్య సభ్యులు 75 నుంచి 100 మందిని వినియోగించే దిశగా పార్టీ నిర్ణయం తీసుకుంది. యాప్‌ల ద్వారా నమోదుకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోను ఈనెల 26న పార్టీ సభ్యత్వాలను నమోదు చేసే దిశగా రంగం సిద్ధం చేశారు. దీంతో స్థానిక సమరం దిశగా సభ్యత్వ నమోదులో జనసేన ముందంజ వేస్తుందా.. అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.