అంగన్‌వాడీల పోరుబాట!
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:15 AM
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవ డానికి అంగన్‌వాడీలు మరోసారి దశలవారీ పోరాటానికి సిద్ధమయ్యా రు. ఈనెల 24వ తేదీ మంగళవారం నుంచి 27వ తేదీ శుక్రవారం వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిలో రిలే నిరా హార దీక్షలు చేయడంతో పాటు వచ్చే మార్చి 2దీన విజయవాడలో మహాధర్నా చేస్తామని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు తెలిపారు.
నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు
సమస్యల పరిష్కారమే అజెండా
పెదవేగి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవ డానికి అంగన్‌వాడీలు మరోసారి దశలవారీ పోరాటానికి సిద్ధమయ్యా రు. ఈనెల 24వ తేదీ మంగళవారం నుంచి 27వ తేదీ శుక్రవారం వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిలో రిలే నిరా హార దీక్షలు చేయడంతో పాటు వచ్చే మార్చి 2దీన విజయవాడలో మహాధర్నా చేస్తామని అంగన్‌వాడీ యూనియన్ నాయకులు తెలిపారు.
తీరిక లేని చాకిరీ, చాలీచాలని జీతాలు, పెరిగిన నిత్యావసరాలకు అను గుణంగా పెరగని వేతనాలు, అర కొర మెనూ చార్జీలు, అందని విద్యు త్ బిల్లులు, గ్యాస్ బిల్లుల భారం వంటి వాటితో నెలవారీ ఖర్చు తడిసి మోపెడవుతోందని, ప్రభుత్వం మా సమస్యల పరిష్కారానికి అడుగు ముందుకు వేయడం లేదని అంగన్‌వాడీలు వాపోతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ దగ్గరనుంచి ప్రతి పనికి మమ్మల్ని ఉపయో గించుకుంటున్న ప్రభుత్వం.. మా సంక్షేమాన్ని మరిచిందని విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రూ.ఐదు లక్షలు గ్రాట్యు టీ చెల్లించాలని, మినీ సెంటర్ సిబ్బందికి మెయిన్ సెంటర్‌లతోపాటు వేతనా లు ఇవ్వా లని, పని భారం తగ్గించాలని, అంగన్‌వాడీ సహాయకుల పదోన్నతి వయస్సును తగ్గిం చాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 2,225 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా ఆరేళ్ల లోపు బాలలు 95 వేల మంది అంగన్ వాడీ సేవలు పొందుతున్నారు. గర్భి ణులు ఎనిమిది వేల మంది, బాలిం తలు 9,300 మంది సేవలు అందుకుంటున్నారు.
ఉత్తుత్తి హామీలతో వంచించిన జగన్
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో తనను కలిసిన అంగన్‌వాడీలతో తెలంగాణ రాష్ట్రానికి మించి వేతనం అంది స్తా మని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. కానీ అధి కారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన వాగ్దానా లను జగన్ ప్రభుత్వం మరిచింది. ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశించిన అంగన్‌వాడీలు నాలుగేళ్లపాటు ఎదు రుచూసి, హామీల కోసం రోడ్డెక్కారు. 2023 డిసెంబరు 12వ తేదీ నుంచి 2024 జనవరి వర కు 42 రోజులు పాటు పోరాటం చేశారు. దిగొచ్చిన వైసీపీ ప్రభుత్వం 2024 జూలైలో వేతనాల పెంపుతోపాటు ఇతర సమ స్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అంగన్ వాడీలు సమ్మె విరమించారు. అయితే జూలై వచ్చినా ప్రభుత్వం మారి టీడీపీ అధికా రంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందని ఆశించిన అంగన్‌వాడీలకు నిరాశే ఎదురైంది. దీంతో మరోసారి పోరుబాటకు దిగుతున్నారు. మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వ స్పందనను చూసి, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
డిమాండ్లు ..
కనీస వేతనం రూ.26 వేలు చేయాలి. అపరిష్కృతంగా ఉన్న 1,810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి, ప్రధాన కేం ద్రాలుగా మార్చాలి. గ్రాట్యూటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలి. వేతనంతో కూడి న మెడికల్ సెలవులు ఇవ్వాలి. అంగన్‌వాడీ లకు సంక్షేమ పథకాలు అర్చన్, రూరల్ తేడా లేకుండా అమలుచేయాలి. సహాయకుల పదో న్నతిపై నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించి అమలు చేయాలి. ఖాళీగా ఉన్న 164 సూపర్‌వైజర్ల పోస్టులను భర్తీ చేయాలి. మే నెల మొత్తం వేసవి సెలవుల జీవో వెంటనే ఇవ్వాలి. లబ్ధిదారులకు బియ్యం, నూనె, కంది పప్పు పరిమాణం పెంచాలి. మెనూ చార్జీలు పెంచాలి. ఉచితంగా గ్యాస్ సరఫరా చేయా లి. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. దీంతో పాటు ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పఽథకాన్ని అమలు చేయాలి. ఐదేళ్లలోపు పిల్ల లంతా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉండేలా జీవో ఇవ్వాలి. సాయంత్రం స్నాక్స్ పునరు ద్ధరించాలి.