Share News

AP Govt: ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయిందిగా

ABN , Publish Date - Jan 01 , 2026 | 12:15 PM

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. నూతన సంవత్సరం బహుమతిగా భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

AP Govt: ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయిందిగా
AP Govt

అమరావతి, జనవరి 1: రాష్ట్ర ప్రజలకు రెవెన్యూ శాఖ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. భూయాజమానులకు ఊరటనిచ్చేలా 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad) సంతకం చేశారు. ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో మంత్రి తొలి సంతకం చేశారు. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది.


ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే స్వాంత్రత్య సమర యోధుల భూములను, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22ఏ నుండి తొలగించనున్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ ఒక్కటే సరిపోతుందని సర్కార్ స్పష్టం చేసింది. అదే విధంగా 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా, ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు ఉన్నా చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ప్రసాద్ స్పష్టం చేశారు.


రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి సరిపోతుందని.. 8ఏ రిజిస్టర్లు, డికెటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటే అని తెలియజేసింది. దాదాపు 8 రకాల ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యాజమానులను తిప్పుకోకూడదని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం బహుమతిగా భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రైతులకు, భూయాజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఇదీ హైదరాబాద్ అంటే.. సీపీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్

దారుణం.. కన్న బిడ్డలను చంపేసిన తండ్రి.. ఆపై

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 12:27 PM