Home » Anagani Satya Prasad
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ రాజకీయ అసమర్థుడని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ చేస్తోన్న ప్రచారం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు.
బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మీ భూమి - బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుండి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
మూడేళ్ల క్రితం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం ఓ సైకో నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తీరుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.
జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సీఐ వెంకటేశ్వర్లు అతిగౌరవం చూపించారని ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మంగళవారం అమరావతి వేదికగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం భూ అక్రమాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
రాజధాని అమరావతి రైతుల మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి పర్యటన పేరుతో వైసీపీ నేతలు బజార్ రౌడీల స్థాయి కన్నా దిగజారి ప్రవర్తించారని ధ్వజమెత్తారు.