Share News

Anagani Satya Prasad: ఆ ప్రాంత అభివృద్ధి రాంప్రసాద్‌కూ ముఖ్యమే.. హెస్టీ డెసిషన్లు తీసుకోరు: మంత్రి అనగాని

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:58 PM

రాయచోటి మార్పు వ్యహారంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చాలా బాధపడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రిమండలి తరవాత కూడా రాంప్రసాద్ రెడ్డిని పిలిచారన్నారు.

Anagani Satya Prasad: ఆ ప్రాంత అభివృద్ధి రాంప్రసాద్‌కూ ముఖ్యమే.. హెస్టీ డెసిషన్లు తీసుకోరు: మంత్రి అనగాని
Anagani Satya Prasad

అమరావతి, డిసెంబర్ 29: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad reddy) తీవ్ర భావోద్వేగానికి గురవడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు (CM Chandrababu).. మంత్రితో మాట్లాడారు. అలాగే రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయి అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారంపై మంత్రులు అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad), నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) మీడియాతో మాట్లాడారు. రాయచోటి మార్పు వ్యహారంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చాలా బాధపడుతున్నారని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మంత్రిమండలి తరవాత కూడా రాంప్రసాద్ రెడ్డిని పిలిచారన్నారు. ఆయన్ను ఓదార్చినట్లు తెలిపారు. రాయచోటిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారని అన్నారు.


ఈ సమస్యను రాంప్రాసాద్ రెడ్డి అన్ని విధాలా అధిగమిస్తారని మంత్రి తెలిపారు. ఆయనకు మెడికల్ కాలేజీ కావాలా?.. ఇంకేం ఏమన్నా కావాలా అన్న విషయాన్ని ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. అలాగే రాంప్రసాద్ రెడ్డి రాజీనామా లాంటి హెస్టీ డెసిషన్‌లాంటివి తీసుకోరన్నారు. ఆయనకు కూడా తమ ప్రాంత అభివృద్ధి ముఖ్యం అని భావిస్తారని మంత్రి స్పష్టం చేశారు. అన్నమయ్య ఎక్కడ జన్మించినా శ్రీవారి సేవలో ఉన్నారని తెలిపారు. అన్నమయ్యకు ప్రాంతాలు ఉండవని... గతంలో కూడా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జన్మిస్తే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేసి పెట్టారని మంత్రి అనగాని గుర్తుచేశారు.


ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించాం: మంత్రి నాదెండ్ల

Cyclone Motha

పరిపాలనా సౌలభ్యం కోసమే రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి కేంద్రం సహకారంతో ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలను కేబినెట్ చివరన సీఎం తెలిపారన్నారు. అభివృద్ధి, సంక్షమం కింద రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచామని.... రూ.50 వేల కోట్లు పెన్షన్ల కింద పంపిణీ చేశామని అన్నారు. సూపర్ సిక్స్ చాలా బాగా సక్సెస్ చేయగలిగామని.... ఆర్థిక ఇబ్బందులున్నా దీన్ని అధిగమించగలిగామని తెలిపారు. ప్రతి గ్రామంలో పల్లె పండుగ తెచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేశారన్నారు.


ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి గూగుల్ విశాఖకు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. గంజాయిపై తాము చేసిన యుద్ధం గురించి కూడా సీఎం కేబినెట్‌లో ప్రస్తావించారని తెలిపారు. రాయలసీమలో తిరుపతిని ఇండస్ట్రియల్ హబ్‌గా, నెల్లూరు పోర్టును ఉపయోగించుకొని 2026లో ముందుకు వెళితే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు వెళాతామన్నారు. పట్టుదలతో , అంకిత భావంతో బాధ్యతగా పనిచేద్దామని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి

21 అంశాల అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 04:09 PM