Share News

APSA Elections: అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:41 AM

ప్రత్యేక ఎన్నికల అధికారి జంపని శివయ్య పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

APSA Elections: అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి
APSA Elections

అమరావతి, డిసెంబర్ 29: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమైంది. ప్రత్యేక ఎన్నికల అధికారి జంపని శివయ్య పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. అప్సా అధ్యక్ష పదవితో పాటు మరో ఎనిమిది కార్యవర్గ సభ్యుల పదవులకు, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌కు నేడు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం 1162 మంది ఓటర్లు పాల్గొననుండగా.. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌కు 75 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఎన్నికల్లో 9 అప్సా కార్యవర్గ పదవులకు ఎన్నిక నిమిత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం ఏడు బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. అప్సా అధ్యక్ష పదవికి జి. రామకృష్ణ, కోట్ల రాజేష్, ఎం. కాటంరాజు, వి. కోటేశ్వరరావు మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో సచివాలయంలో సందడి వాతావరణం నెలకొంది.


ఇవి కూడా చదవండి...

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్

పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 12:00 PM