Hyderabad Cyber Fraud: పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:24 AM
సైబర్ నేరాగాళ్ల వలలో ఇద్దరు పోలీసులు చిక్కారు. ఇద్దరు ఇన్స్‌పెక్టర్ల నుంచి దాదాపు రూ.43 లక్షలను వసూలు చేశారు కేటుగాళ్లు.
హైదరాబాద్, డిసెంబర్ 29: సైబర్ నేరాల పట్ల అప్రత్తమంగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అన్నోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది సైబర్ కేటుగాళ్ల చేతులో మోసపోతూనే ఉన్నారు. సైబర్ మోసాలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పోలీసులకే శఠగోపం పెట్టారు కేటుగాళ్లు. ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షలు పోగొట్టుకున్న పరిస్థితి. వివరాల్లోకి వెళితే..
సైబర్ నేరస్తుల వలలో ఇద్దరు రాచకొండ ఇన్స్‌పెక్టర్లు చిక్కడం కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం పేరుతో ఓ ఇన్స్‌పెక్టర్ నుంచి దాదాపు రూ.4 లక్షలు వసూలు చేశారు కేటుగాళ్లు. అలాగే స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడుల ద్వారా అధిక లాభం వస్తుందని మరో ఇన్స్‌పెక్టర్ నుంచి ఏకంగా రూ.39 లక్షల వరకు వసూలు చేశారు. సైబర్ నేరగాళ్లు ఎంతో చాకచక్యంగా వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ గ్రూప్‌లో యాడ్ చేయడంతో సదరు ఇన్స్‌పెక్టర్ నమ్మి మోసపోయినట్లు సమాచారం.
మోసపోయిన ఇద్దరు పోలీస్ ఇన్స్‌పెక్టర్లు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు... నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కంప్లైంట్ చేశారు. అలాగే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ..
నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
Read Latest Telangana News And Telugu News