Trump Meeting with Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ..
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:02 AM
గత కొంత కాలంగా ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు శాంతి చర్చలు జరిపినప్పటికీ.. యుద్ధం ఆపలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలక భేటీపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్(Ukraine) -రష్యా(Russia), ఇజ్రాయెల్ (Israel)- పాలస్తీన(Palestine), ఇజ్రాయెల్-ఇరాన్ (Iran) మధ్య యుద్ధం (War)కొనసాగుతోంది. ఇక భారత్ దాయాది దేశం పాక్ తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మూడేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ (Ukraine Russia war) మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తులు నష్టపోయారు. ఇరు దేశాల మధ్య ఎంతగా శాంతి ఒప్పందాలు జరిగినప్పటికీ ఎవరూ తగ్గకుండా యుద్దం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy)..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య కీలక భేటీ జరిగింది. ఫ్లోరిడా(Florida) లోని మార్-ఎ- లాగోరో నివాసంలో జెలెన్స్కీ, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. యుద్దాన్ని వీలైనంత త్వరగా ముగించడమే లక్ష్యంగా చర్చలు కొనసాగాయి. యుద్దాన్ని ముగించడానికి 20 పాయింట్ల శాంతి ప్రణాళికపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తూనే, ఉక్రెయిన్ చర్చలకు రాకపోతే సైనిక చర్యలు తీవ్రం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఈ విషయంపై ఇరు దేశాల అధ్యక్షులు చర్చించినట్లు తెలుస్తుంది.
ఈ సమావేశం చాలా బాగా నడిచిందని ట్రంప్ అభివర్ణించారు. మేము యుద్దాన్ని ముగించడానికి ఎంతగానో కష్టపడుతున్నాం..అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జెలెన్స్కీ అనంతరం జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఈ భేటీ న‘నిర్మాణాత్మకమైనది’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు బలం ద్వారా శాంతి ఎంతో అవసరం అని అన్నారు. ట్రంప్ నాయకత్వంలో త్వరలో శాంతి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇద్దరు అధ్యక్షులు గతంలో కంటే ఎంతో ఉత్సాహంగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. ఇకనైనా రష్య-ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆగుతుందా?లేదా? అన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత