Share News

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Dec 29 , 2025 | 10:34 AM

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరికి క్యారెక్టర్ లేదని వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారామంటూ చెప్పుకోలేని బతుకు వాళ్లది అంటూ విమర్శించారు.

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన కామెంట్స్
KTR

హైదరాబాద్, డిసెంబర్ 29: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మారిన వాళ్లది ఎటు కాని బతుకైందంటూ వ్యాఖ్యలు చేశారు. పుట్టింటి వాళ్లు తరిమేశారు.. కట్టు కున్నోడు వదిలేశాడు అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ మారినమని కూడా చెప్పుకోలేని బతుకు వాళ్లది అంటూ విమర్శించారు.


బీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన తలసాని శ్రీనివాస్ వంటి నేతలు బాజాప్తా పార్టీ మారినట్లు చెప్పారని గుర్తుచేశారు. కడియం శ్రీహరికి క్యారెక్టర్ లేదన్నారు. సైది రెడ్డి కనీసం సర్పంచ్‌లను గెలిపించుకోలేకపోయారన్నారు. వ్యక్తులు పార్టీ మారితే తమకు వచ్చే నష్టం ఏమి లేదని స్పష్టం చేశారు. మొన్నటి పంచాయతీ ఎన్నికలే అందుకు ఉదాహరణ అని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే తమకు మంచి మెజారిటీ వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


మరోవైపు... బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు బిల్లులు చెల్లించలేదని, అవి పెండింగ్‌లో ఉన్నాయంటూ మాజీ సర్పంచ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిరసనకు దిగిన మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి...

పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 10:37 AM