AP Cabinet Meeting: 21 అంశాల అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:17 PM
21 అంశాలు అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించి చర్చ జరుగనుంది.
అమరావతి, డిసెంబర్ 29: ఏపీ మంత్రి మండలి సమావేశం (AP Cabinet Meeting) కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించి కీలకంగా చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం 21 అంశాలు అజెండాగా మంత్రిమండలి సమావేశం జరుగుతోంది.
ఏలూరు జిల్లా నూజివీడు టౌన్‌లో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మెనేజ్మెంట్ కోసం 9.96 ఎకరాలు భూమిని డైరెక్టర్, హర్టీకల్చర్, సెరికల్చర్ డిపార్మెంట్‌కు 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలిలో ఆమోదం తెలుపనున్నారు. వేదాంతా లిమిటెడ్‌కు 9.88 ఎకరాలు భూమిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లాలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ యాక్టివీటీ కోసం మూడేళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ఈరోజు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. 37 ఎకరాలు ప్రభుత్వ భూమిని తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం ఉచితంగా అందిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
నాబార్డు నుంచి రూ.7387.70 కోట్లు బుణం పొందేందుకు సీఆర్డీఏకు అనుమతినిస్తూ క్యాబినెట్‌లో నేడు ఆమోదం తెలుపనున్నారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అమరావతిలో వరద నీటి పంపింగ్ స్టేషన్–2 (ఉండవల్లి) నిర్మాణానికి ఎల్1 బిడ్‌కు ఆమోదం తెలుపున్నారు. రూ.443.76 కోట్ల వ్యయంతో 8400 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ నిర్మాణం, 15 ఏళ్ల ఆపరేషన్ & మెయింటెనెన్స్‌తో కాంట్రాక్ట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ఇవి కూడా చదవండి...
పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు
అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి
Read Latest AP News And Telugu News