Home » AP Cabinet Meet
రాష్ట్రంలో కేబినెట్ హోదా కలిగిన వారి జీతాలు, అలవెన్సులను ప్రభుత్వం పెంచింది.
Andhrapradesh: వచ్చే విద్యాసంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
Andhrapradesh: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం వలన వచ్చిన నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారుల కృషి వలన 85 శాతం రిజర్వాయర్లు నిండాయన్నారు. రిజర్వాయర్లలో 75 శాతం నీటి నిల్వలు ఇంకా ఉన్నాయని తెలిపారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలకు ఆమోద ముద్ర లభించింది. తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కు పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది.
Andhrapradesh: అమరావతిలో రూ.2700 కోట్ల విలువ కల రెండు ఇంజరీనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లే అవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, విద్యా, వ్యవసాయ సంబంధిత పథకాలు సహా పలు అంశాల గురించి చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ టెక్స్టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్లో ఆమోదించినట్లు చెప్పారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్ మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి, వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం షెడ్యూల్లో కీలక మార్పులు జరిగాయి. డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం తేదీని మారుస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.