AP Cabinet Meeting: జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:06 PM
ఏపీ మంత్రి మండలి సమావేశం జనవరి 8న జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతి, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలో ఏపీ మంత్రి మండలి సమావేశం (AP Cabient Meeting) తేదీ ఖరారైంది. జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను జనవరి 6వ తేదీ సాయంత్రం 4:00 గంటలలోపు సమర్పించాలని మెమో జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో, శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలు, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్యా, రోడ్లు, రవాణా, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభాగాల ప్రతిపాదనల ఆధారంగా కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టుల అనుమతులు, కీలక పదవుల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదివండి...
దారుణం.. భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త
శివలింగం ధ్వంసం ఘటన.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు
Read Latest AP News And Telugu News