Share News

Palnadu: దారుణం.. భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త

ABN , Publish Date - Dec 31 , 2025 | 09:41 AM

పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్తానికంగా సంచలనం రేపింది.

Palnadu: దారుణం.. భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త
Palnadu

పల్నాడు, డిసెంబర్ 31: భార్యా, భర్తల మధ్య అనుబంధం రోజు రోజుకు క్షీణించిపోతోందని చెప్పుకోవాలి. ప్రేమ ఉండాల్సిన చోట అనుమానం వచ్చి చేరుతోంది. కట్టుకున్న భార్యను మోసం చేసి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భర్తలు ఉన్నట్లే, భర్తలను మోసం చేస్తున్న భార్యలు కూడా ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇక అనుమానం ఉన్న భార్యా/భర్తల సంగతి చెప్పక్కర్లేదు. అనమానం అనే రోగంతో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనలు ఇటీవల చాలానే చూశాం. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అనుమానానికి ఓ నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే..


జిల్లాలోని చిలకలూరిపేట మండలం వేలూరులో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. వేలూరులో సాల్మన్ రాజు, పుష్ప దంపతులు నివాసముంటున్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి భర్తకు భార్యపై అనుమానం ఉండేది. దీని కారణంగా ప్రతీరోజు ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. అలాగే గత రాత్రి కూడా ఇదే విషయంపై దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన భర్త సాల్మన్ రాజు భార్యపై అనుమానంతో పచ్చడి బండతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదివండి...

పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 31 , 2025 | 09:49 AM