NTR Bharosa Pensions: పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:51 AM
రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ఈ రోజు నుంచి అంటే.. బుధవారం నుంచి చేయనున్నారు. జనవరి 1వ తేదీ సెలవు కావడంతో.. ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీని చేపట్టనున్నారు.
అమరావతి, డిసెంబర్ 31: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి అంటే.. బుధవారం నుంచి చేపట్టనున్నారు. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా.. డిసెంబర్ 31వ తేదీన.. ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ. 2,743 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ నగదును పెన్షన్‌దారులకు వారి ఇంటి వద్దే ఈ నగదు సచివాలయ సిబ్బంది అందజేయనున్నారు. ఈ రోజు పెన్షన్ తీసుకోని వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేస్తారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు. కానీ కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా జనవరి 1వ తేదీ సెలవు. ఈ కారణంగా.. ఒక రోజు ముందే పెన్షన్‌ను అందజేయనున్నారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి నెల1వ తేదీన లబ్ధిదారుల్లో ఒకరికి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పింఛన్ అందజేస్తున్నారు. ఇలా ప్రతి నెల 1వ తేదీన రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ అందజేసిన విషయం విదితమే. డిసెంబర్ 30వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జనవరి 4వ తేదీన ఆయన తిరిగి అమరావతి చేరుకోనున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
ద్రాక్షారామ ఘటనపై మంత్రితో మాట్లాడిన సీఎం
వైసీపీ నేతల దర్శనాలపై సోషల్ దుమారం
For More AP News And Telugu News