CM Chandrababu Naidu: ద్రాక్షారామ ఘటనపై మంత్రితో మాట్లాడిన సీఎం
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:13 AM
పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.
అమరావతి, డిసెంబర్ 31: పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామలోని భీమేశ్వరస్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు సీఎంకు మంత్రి ఆనం వివరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి నది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని ధ్వంసం చేసినట్లు మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన ద్రాక్షారామకు చేరుకుని ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు రప్పించి.. ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాడ కనిపెట్టేందుకు ఆరు బృందాలను రంగంలోకి దింపారు. స్తుతితో శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో.. పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
వైసీపీ నేతల దర్శనాలపై సోషల్ దుమారం
For More AP News And Telugu News