Home » Palnadu
పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్తానికంగా సంచలనం రేపింది.
కూటమి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ఇలాంటి ప్రోగ్రామ్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.
పల్నాడు జిల్లాలో మరోసారి జంట హత్యలు కలకలం రేపాయి. అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములను పథకం ప్రకారం దుండగులు హత్య చేశారు. ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో..
ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించటం మొదలెట్టారు. ప్రేమించకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. చివరకు పాపం పండి జైలు పాలయ్యారు. పోలీసులు వారిపై ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
ఓ యువకుడు సైబర్ నేరానికి గురయ్యాడు. ఏకంగా 20 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఓ యువతి అతడ్ని ట్రాప్ చేసి మరీ దోచేసింది. బంగారం, వెండి పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడింది.
జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీం ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో సరెండర్ అయ్యారు.
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లికి సంఘీభావంగా విడదల రజిని మాచర్ల వెళతారని అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు విచారణ జరిపి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌కు కారును అడ్డుపెట్టి ఆపడం వల్ల మరో కారు వచ్చి ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.
తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.