Murders: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మరోసారి జంట హత్యలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:12 AM
పల్నాడు జిల్లాలో మరోసారి జంట హత్యలు కలకలం రేపాయి. అడిగొప్పల గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములను పథకం ప్రకారం దుండగులు హత్య చేశారు. ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 22: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో జంట హత్యలు కలవరం పుట్టించాయి. కొత్త శ్రీరాం మూర్తి, కొత్త హనుమంతరావు అనే ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు పథకం రచించి, కాపుగాచి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో అడిగొప్పల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజకీయ, వ్యక్తిగత వైరాలు లేదా ఇతర కారణాలతో ఈ హత్యలు జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాచర్ల ప్రాంతంలో గత కొంతకాలంగా రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రంగా ఉండటం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భద్రతను పెంచారు.
ఈ ఘటనపై స్థానిక రాజకీయ నాయకులు స్పందించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్
మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి