Maharashtra Local Body Elections: మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
ABN , Publish Date - Dec 21 , 2025 | 03:58 PM
మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిపత్య సాగిస్తోంది.
ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి (Mahayuti , విపక్ష మహావికాస్ అఘాడి (MVA) ఈ ఎన్నికల్లో పోటీ పడగా, మహాయుతి కూటమి ముఖ్యంగా బీజేపీ తిరుగులేని అధిక్యత చాటుతోంది. మొత్తం 288 స్థానిక సంస్థలకు (246 మున్సిపల్ కౌన్సిళ్లు, 42 నగర పంచాయతీలు) రెండు దశలుగా డిసెంబర్ 2, డిసెంబర్ 20న పోలింగ్ జరుగగా, ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ మొదలైంది.
మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 59 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. విపక్ష మహాకుటమి 49 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కూటమిలోని కాంగ్రెస్ 32 స్థానాల్లో అధిక్యత సాగిస్తోంది.
కాగా, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే జనవరి 15న జరిగే బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. టికెట్ ధరలు పెంపు.. ఎప్పటి నుంచంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి