Home » Local Body Elections
స్థానిక ఎన్నికల తరుణంలో ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లపై దృష్టి సారించారు అభ్యర్థులు. దీంతో వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా మీట నొక్కడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఎన్నికల పోలింగ్లో అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఏంటన్న ప్రశ్న మీకెప్పుడైనా తలెత్తిందా? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? నోటా ప్రాధాన్యం ఏంటి? ఆ వివరాలు మీకోసం..
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. అయితే.. సర్పంచ్ అధికారాలేంటి? నిర్వర్తించాల్సిన విధులేంటనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం..
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. సర్పంచ్, వార్డు మెంబర్గా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. దీంతో ఇంటింటి ప్రచారంతో ఒకవైపు గ్రామంలో నివాసముంటున్న ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగా జాగ్రత్త పడుతున్నారు.
కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధిగా మున్నూర్ శివకుమార్ పోటీ చేస్తున్నారు. రూ.100 బాండ్ పేపర్ పై 12 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పనులు, ఆడ పిల్ల పుడితే రూ.2,500, పెళ్లి కానుకగా రూ.5,501 ఇస్తానని హామీ ఇచ్చారు.