Share News

Local Body Election: ఓటమి భయం.. ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి

ABN , Publish Date - Dec 17 , 2025 | 10:16 AM

కొమురంభీం ఆసిఫాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Local Body Election:  ఓటమి భయం.. ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి
Local Body Election

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఈ రోజు (బుధవారం) మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. జనం పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం

ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో డబ్బుల వరద పారింది. గెలుపు దక్కించుకోవటం కోసం సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారు. మందు, ముక్క, డబ్బులతో ఓటర్లను ముంచెత్తారు. అయితే, డబ్బులు పంచలేకపోయిన వారు ఓటమి భయంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొమురంభీం ఆసిఫాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. డబ్బులు లేకపోవడంతో ఓటమి పాలవుతానన్న భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యలు చెబుతున్నారు. రాజయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


ఇవి కూడా చదవండి

డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్త.. పాదాల్లో జలదరింపు ప్రమాదకర సంకేతం కావచ్చు

వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు

Updated Date - Dec 17 , 2025 | 10:20 AM