Singareni Tiger: వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు
ABN , Publish Date - Dec 17 , 2025 | 09:55 AM
సింగరేణిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 17: సింగరేణిలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కోల్ బెల్ట్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే5, ఎస్ఆర్పి 3 మైన్స్, సంఘమల్లెపల్లి పరిసర అటవీ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు పెద్దపులి కనిపించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారి ఆశిష్ సింగ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు అక్కడకు చేరుకుని పులి జాడ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు.
అయితే గతంలోనూ ఇదే ప్రాంతంలో పులి సంచరించినట్లు కార్మికులు చెబుతున్నారు. పెద్దపులి సంచారంతో సింగరేణిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దపులి ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో అని సింగరేణి కార్మికులు, వాహనదారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. పులి సంచరిస్తుండటంతో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సింగరేణి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని, రాత్రి పూట ప్రయాణాలు పెట్టుకోవద్దని కీలక సూచనలు చేశారు. కాగా.. వీలైనంత త్వరగా పెద్దపులిని పట్టుకోవాలని అటవీ అధికారులను సింగరేణి కార్మికులు కోరుతున్నారు. మరోవైపు పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు
ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..
Read Latest Telangana News And Telugu News